kohli: కోహ్లీకి కంగ్రాట్స్ చెప్పిన క్రికెట్ వీరులు

  • తీవ్రమైన ఏకాగ్రత, నిలకడ ఉన్న కోహ్లీ
  • విరాట్ ఆటతీరు అద్భుతం
  • కోహ్లీ పరుగుల ప్రవాహం ఇలానే కొనసాగాలన్న సచిన్
వన్డేల్లో శరవేగంగా పది వేల పరుగుల మైలురాయిని అధిగమించిన టీమిండియా క్రికెటర్ విరాట్ కోహ్లీకి క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ అభినందనలు తెలిపాడు. తీవ్రమైన ఏకాగ్రత, నిలకడతో ఉన్న కోహ్లీ ఆటతీరు అద్భుతమని ప్రశంసిస్తూ సచిన్ ఓ ట్వీట్ చేశాడు. ఇలానే కోహ్లీ పరుగుల ప్రవాహం కొనసాగుతూ ఉండాలని సచిన్ ఆకాంక్షించాడు.

కాగా, టీమిండియా మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ కూడా కోహ్లీని ప్రశంసించాడు. ఈ మేరకు తన దైన శైలిలో ఓ ట్వీట్ చేశాడు. కోహ్లీ తన సాప్ట్ వేర్ ను ఎప్పటికప్పుడు అప్ డేట్ చేస్తున్నాడని, ‘నిలకడ’ అనే పదానికి కోహ్లీ కొత్త నిర్వచనం ఇచ్చాడంటూ ప్రశంసించాడు. టీమిండియా మాజీ క్రికెటర్ వీవీఎస్ లక్ష్మణ్ కూడా కోహ్లీకి అభినందనలు తెలిపాడు. కోహ్లీ పరుగుల దాహం అద్భుతమని ట్వీట్ చేశాడు.
kohli
Sachin Tendulkar
verendra sehwag

More Telugu News