Pavan kalyan: 'జానీ'లో నటించేందుకు నేను ఇష్టపడలేదు.. పవనే ఒప్పించారు!: రేణు దేశాయ్

  • జానీ సినిమాకు ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేశా
  • రెండు వారాల ముందు హీరోయిన్‌గా ఎంపిక
  • రోజుకు 17 గంటల పాటు పనిచేశా
పవన్ కల్యాణ్, రేణు దేశాయ్ జంటగా నటించిన 'జానీ' సినిమా గుర్తుంది కదా.. నాటి విశేషాలను రేణు దేశాయ్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా తాజాగా వెల్లడించారు. ఆ చిత్రం షూటింగ్ ప్రారంభం కావడానికి రెండు వారాల ముందు తనను కథానాయికగా ఎంపిక చేశారని.. కానీ మొదట్లో తాను ఒప్పుకోలేదని.. చివరికి పవన్ తనను ఒప్పించారని రేణు తెలిపారు.

‘‘జానీ సినిమాకు నేను మొదట ప్రొడక్షన్ డిజైనర్‌గా పనిచేశాను. షూటింగ్‌కు రెండు వారాల ముందు నన్ను ఈ సినిమాకు హీరోయిన్‌గా ఎంపిక చేశారు. నేను ఒప్పుకోలేదు. నా ఆసక్తి మొత్తం ప్రొడక్షన్ డిజైనింగ్, సాంకేతిక వర్గంపైనే ఉంది. కానీ చివరికి పవన్ నన్ను ఒప్పించారు. దీంతో ఏడు నెలల పాటు రోజుకు 17 గంటలు పనిచేశా. ప్రొడక్షన్ డిజైనర్‌గా పనులు చూసుకుని, మేకప్ రూమ్‌కి వెళ్లి హీరోయిన్‌గా సిద్ధమయ్యేదాన్ని. జీవితం ఏదైనా సవాలు విసిరితే.. స్వీకరించాలి. అప్పుడే మనం వ్యక్తిగతంగానూ, వృత్తిపరంగానూ ఎంతో నేర్చుకుంటాం’’ అని రేణు ఇన్‌స్టాగ్రాంలో పేర్కొన్నారు.
Pavan kalyan
Renu Desai
Johny Movie
Production Designer
Heroine

More Telugu News