linguswami: జయలలిత బయోపిక్ లో నయనతార!

షార్ట్స్‌లో చూడండి
ఒక వైపున బాలీవుడ్లోను .. మరో వైపున టాలీవుడ్లోను బయోపిక్ ల జోరు కొనసాగుతోంది. కొన్ని బయోపిక్ లు ఆల్రెడీ సక్సెస్ లు సొంతం చేసుకోగా, మరికొన్ని సెట్స్ పై వున్నాయి. ఇక కోలీవుడ్లో కూడా బయోపిక్ ల జోరు పెరగనున్నట్టు తెలుస్తోంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి దివంగత జయలలిత జీవితచరిత్రను రూపొందించడానికి అక్కడ మూడు ప్రాజెక్టులు లైన్లోకి వచ్చాయి. ఎవరికివారు సాధ్యమైనంత త్వరగా తమ ప్రాజెక్టులను పట్టాలెక్కించే పనిలో వున్నారు.

ఈ నేపథ్యంలో దర్శకుడు లింగుస్వామి కూడా జయలలిత బయోపిక్ ను రూపొందించడానికి రెడీ అవుతున్నాడు. జయలలిత జీవితంలో ఎన్నో అనూహ్యమైన మలుపులు వున్నాయి .. ఆ మలుపుల్లో జయాలు .. అపజయాలు వున్నాయి. వాటన్నింటినీ కలుపుతూ లింగుస్వామి కథ సిద్ధం చేసుకుంటున్నాడట. జయలలిత పాత్ర కోసం ఆయన నయనతారను అనుకుంటున్నట్టుగా సమాచారం. ఇంతటి బరువైన .. గంభీరమైన పాత్రను ఆమె మాత్రమే చేయగలదని భావించి సంప్రదింపులు జరుపుతున్నట్టుగా తెలుస్తోంది.  
Go Back to Shorts
linguswami

More Telugu News