dhanunjaya: 'భైరవ గీత' విడుదల తేదీని ఖరారు చేసిన వర్మ

  • ప్రేమకథా చిత్రంగా 'భైరవగీత'
  • వర్మ మార్క్ సినిమా 
  • వచ్చేనెల 22న విడుదల

దర్శకుడిగానైనా .. నిర్మాతగానైనా రామ్ గోపాల్ వర్మ ఎంచుకునే కథలు విభిన్నంగా ఉంటాయి. అందువల్లనే ఆయన సినిమాల పట్ల అంతా ఆసక్తిని చూపుతుంటారు. ఆయన సినిమాలు వరుసగా పరాజయాలపాలైనా ఆ తరువాత సినిమా పట్ల ఆత్రుతను చూపుతుంటారు. అలా ఆయన నిర్మాణంలో రూపొందిన 'భైరవగీత' పట్ల కూడా అందరూ కుతూహలాన్ని చూపుతున్నారు.

ఈ సినిమాను వచ్చేనెల 22వ తేదీన విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు. అందుకు సంబంధించిన పోస్టర్ ను కూడా తాజాగా విడుదల చేశారు. కన్నడ నటుడు ధనుంజయ హీరోగా సిద్ధార్థ రూపొందించిన ఈ సినిమా, రాయలసీమ నేపథ్యంలోని ప్రేమకథగా కొనసాగుతుంది. వర్మ టేస్టుకి తగిన సినిమా కావడం వలన, ఆయన మార్కు సినిమాగానే ఇది ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇక ఈ సినిమాకి ఆడియన్స్ ఎన్ని మార్కులు ఇస్తారో చూడాలి. 

More Telugu News