Narendra Modi: ప్రధాని మోదీకి దక్కిన ప్రతిష్ఠాత్మక అవార్డ్

  • ప్రధానికి దక్కిన ‘సియోల్ పీస్ ప్రైజ్ 2018’
  • ఆర్థిక వృద్ధి, ప్రపంచ శాంతి కృషికి దక్కిన గౌరవం
  • హర్షం వ్యక్తం చేసిన ప్రధాని
ప్రధాని నరేంద్ర మోదీ కృషికి మరో ప్రతిష్ఠాత్మక అవార్డ్ దక్కింది. ‘సియోల్ పీస్ ప్రైజ్ 2018’ అవార్డ్ ఆయనను వరించింది. ఆర్థిక సమ్మిళిత, పరిపాలన సమ్మిళితంగా వ్యవహరిస్తున్న ‘మోడినొమిక్స్’ ద్వారా భారత్‌తో ప్రపంచంలో అధిక ఆర్థిక వృద్ధి, ప్రపంచ శాంతికి సహకారం, మానవభివృద్ధితోపాటు భారత్‌లో ప్రజాస్వామ్య మెరుగుదలకు చేస్తున్న కృషికిగాను ఆయనకు ఈ అవార్డ్ దక్కిందని విదేశీ వ్యవహారాల శాఖ బుధవారం ప్రకటించింది. మోదీ కృషికి ఈ అవార్డ్ దక్కిందని, ఈ అవార్డ్ దక్కిన 14వ వ్యక్తి ప్రధాని మోదీ కావడం విశేషమని వెల్లడించింది.

ఈ అవార్డ్ దక్కడంపై ప్రధాని మోదీ సంతోషం వ్యక్తం చేశారు. విశిష్టమైన గౌరవం దక్కడం పట్ల ధన్యవాదాలు తెలియజేశారు. ‘సియోల్ ప్రైజ్ ఫౌండేషన్ ఈ అవార్డ్‌ను మోదీకి బహుకరించనుంది. 1990లో సియోల్ నగరంలో జరిగిన 24వ ఒలింపిక్స్ జ్ఞ‌ాపకార్థం ఈ అవార్డ్‌ను స్థాపించారు. దేశాల మధ్య స్నేహపూర్వక బంధాలు, ప్రపంచ శాంతి కోసం కృషి చేస్తున్న వ్యక్తులకు ఈ అవార్డ్‌తో సత్కరిస్తున్నారు.
Narendra Modi
Prime Minister

More Telugu News