India: మరోసారి కాల్పుల ఒప్పందాన్ని ఉల్లంఘించిన పాక్

  • ఆర్మీ బెటాలియన్‌పై షెల్స్‌తో దాడి
  • ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు
  • రాజౌరి దాడి రెండు రోజుల తర్వాత ఘటన

జమ్మూకాశ్మీర్‌లోని పూంచ్ జిల్లా నియంత్రణ రేఖ వెంబడి పాకిస్తాన్ మరోసారి కాల్పుల విరమణ ఒప్పందాన్నిఉల్లంఘించింది. పట్టణంలోని ఆర్మీ బెటాలియన్ హెడ్‌క్వార్టర్స్ పై పాక్ దళాలు దాడి చేశాయి. తేలికపాటి మోర్టార్లు వాడుతూ చేసిన ఈ, దాడిలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రక్షణశాఖ అధికార ప్రతినిధి లెఫ్ట్‌నెంట్ కల్నల్ దేవేందర్ ఆనంద్ వెల్లడించారు. జమ్మూలోని రాజౌరి జిల్లాలో నియంత్రణ రేఖ దాటిన ఇద్దరు చొరబాటుదారులు, సైన్యానికి మధ్య జరిగిన దాడిలో ముగ్గురు సైనికులు అమరులైన సంగతి తెలిసిందే. ఈ ఎన్ కౌంటర్ లో ఇద్దరు ఉగ్రవాదులు హతమైన 48 గంటల వ్యవధిలోనే టెర్రరిస్టులు ప్రతీకార దాడికి దిగారు.

రాకెట్ ప్రొపెల్డ్ గ్రనేడ్స్ (ఆర్‌పీజీ)లను పాకిస్తాన్ దళాలు ఉపయోగించాయని దేవేందర్ ఆనంద్ తెలిపారు. పూంచ్‌లోని బెటాలియన్ షెల్టర్‌పై ఒక ఆర్‌పీజీ పడడంతో నిప్పంటుకుందని, నిన్న సాయంత్రం కూడా కాల్పుల ఉల్లంఘన జరిగిందని, కృష్ణఘాటి సెక్టార్‌లో మోర్టార్‌ పడిందని ఆయన మీడియాకు వెల్లడించారు. 

More Telugu News