Mahesh Babu: వావ్ మహేష్... క్లాసీ లుక్స్ లో అదరగొడుతున్న ప్రిన్స్!

  • ప్రస్తుతం న్యూయార్క్ లో 'మహర్షి' షూటింగ్
  • శరవేగంగా సాగుతున్న చిత్ర నిర్మాణం
  • మహేష్ చాలా అందంగా ఉన్నాడని ప్రశంసలు

టాలీవుడ్ ప్రిన్స్ మహేష్ బాబు ప్ర‌స్తుతం వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో 'మ‌హ‌ర్షి' చిత్రం షూటింగ్ లో బిజీగా ఉండగా, ఆ సినిమాకు సంబంధించిన వర్కింగ్స్ స్టిల్స్ విడుదల అయ్యాయి. న్యూయార్క్‌ లో సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతుండగా, మహేష్ తాజా స్టిల్స్ క్లాసీగా ఉన్నాయని అభిమానులు ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ స్టిల్స్ లో మహేష్ గత చిత్రాలతో పోలిస్తే, మరింత అందంగా కనిపిస్తుండటమే గమనార్హం.

 సోషల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొడుతున్న వీటిని చూస్తున్న వారు, వంశీ పైడిప‌ల్లి సినిమాను చాలా స్టైలిష్‌ గా తీస్తున్నాడని కితాబిస్తున్నారు. ఈ స్టిల్స్ సినిమాపై ఉన్న అంచనాలను మరింతగా పెంచాయి. పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో అల్లరి న‌రేష్ ముఖ్య పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. దిల్ రాజు, అశ్వనీదత్ , పీవీపీ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి దేవిశ్రీ ప్రసాద్ మ్యాజిక్ డైరెక్టర్.

More Telugu News