CBI: తక్షణం విధుల్లో చేరండి: నాగేశ్వరరావుకు ప్రభుత్వం ఆదేశం

  • రాత్రి సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ గా నియమితులైన నాగేశ్వరరావు
  • ఉత్తర్వులు వెలువరించిన డీవోపీటీ
  • ఏడాదిన్నరగా జేడీగా ఉన్న నాగేశ్వరరావు

గత రాత్రి సీబీఐకి తాత్కాలిక డైరెక్టర్ గా నియమించబడిన తెలుగుతేజం, ఐపీఎస్ అధికారి మన్నెం నాగేశ్వరరావును తక్షణం విధుల్లో చేరాలని ప్రభుత్వం ఆదేశించింది. మోదీ సూచనల మేరకు నియామకపు ఉత్తర్వులు వెలువరించిన డీవోపీటీ, నాగేశ్వరరావును నేడే విధులు స్వీకరించాలని కోరింది. తక్షణమే ఆయన నియామకం అమల్లోకి వచ్చినట్టని డీవోపీటీ పేర్కొంది. గడచిన ఏడాదిన్నరగా సీబీఐలో జాయింట్ డైరెక్టర్ గా ఉన్న ఆయన, తెలంగాణలోని వరంగల్‌ జిల్లా మండపేట మండలం బోర్‌నర్సాపూర్‌‌ కు చెందిన వారు.

కాగా, సీబీఐ డైరెక్టర్‌ అలోక్‌ వర్మ, ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ ఆస్థానా మధ్య కొనసాగిన వర్గ పోరుతో సీబీఐ పరువు బజారున పడగా, ప్రధాని సీరియస్ అయిన సంగతి తెలిసిందే. వీరిద్దరినీ గత రాత్రి సెలవుపై పంపిన ఉన్నతాధికారులు, ఆపై ఆగమేఘాలపై ఫైళ్లను కదిలించి, నాగేశ్వరరావును తాత్కాలిక డైరెక్టర్ గా నియమించడం జరిగింది.

More Telugu News