Kethireddy Jagadeeswar Reddy: ‘లక్ష్మీస్ వీరగ్రంథం’లో ప్రధాన పాత్రలో శ్రీరెడ్డి.. ప్రకటించిన కేతిరెడ్డి!

  • మళ్లీ ‘లక్ష్మీస్ వీరగ్రంథం’ పనులు ప్రారంభం
  • శ్రీరెడ్డితో చెన్నైలో సంప్రదింపులు
  • గతంలో శ్రీరెడ్డికి అండగా నిలిచిన వర్మ
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ చిత్రాన్ని తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో, కొన్నాళ్ల క్రితం తాను ప్రకటించిన ‘లక్ష్మీస్‌ వీరగ్రంథం’ చిత్రం నిర్మాణం పనులను కూడా దర్శక నిర్మాత కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి వేగవంతం చేస్తున్నారు.  

తన సినిమాలో ప్రధాన పాత్రను శ్రీరెడ్డి పోషించనున్నట్టు కేతిరెడ్డి తాజాగా ప్రకటించారు. దీనికి కారణం వర్మేనని.. అప్పట్లో క్యాస్టింగ్ కౌచ్ విషయమై శ్రీరెడ్డి చేసిన పోరాటానికి వర్మ అండగా నిలిచారని.. కాబట్టి శ్రీరెడ్డికి ప్రధాన పాత్ర ఇస్తున్నట్టు కేతిరెడ్డి తెలిపారు. ఇప్పటికే శ్రీరెడ్డితో చెన్నైలో సంప్రదింపులు జరుపుతున్నామని ఆయన వెల్లడించారు. త్వరలోనే ‘లక్ష్మీస్‌ వీరగ్రంథం’ రెగ్యులర్ షూటింగ్ ప్రారంభానికి కేతిరెడ్డి సన్నాహాలు చేస్తున్నారు.
Kethireddy Jagadeeswar Reddy
Ramgopal Varma
Sri Reddy
Lakshmi's Veeragrandham

More Telugu News