Kadiyam Srihari: రాజయ్య నాపట్ల తప్పుగా ప్రవర్తించినా.. నేనెప్పుడూ అలా ప్రవర్తించలేదు: కడియం శ్రీహరి

  • రాజయ్య నాకు తమ్ముడు
  • అలిగి నియోజకవర్గానికి రావట్లేదని అనుకోవద్దు
  • రాజయ్యను గెలిపించి కానుకగా ఇవ్వాలి
తాను అలిగి నియోజకవర్గానికి రావడం లేదని అనుకోవద్దని తెలంగాణ మాజీ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి పేర్కొన్నారు. స్టేషన్ ఘన్‌పూర్‌లో జరిగిన టీఆర్ఎస్ కార్యకర్తల సమావేశంలో ప్రసంగించిన కడియం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజయ్య తన పట్ల అప్పుడప్పుడు తప్పుగా ప్రవర్తించినా.. తానెప్పుడూ అలా వ్యవహరించలేదన్నారు.

తాను అలిగి నియోజకవర్గానికి రావట్లేదని అనుకోవద్దన్న కడియం.. రాజయ్య తనకు తమ్ముడని పేర్కొన్నారు. టీఆర్ఎస్‌లో ఆయన ఓ ముఖ్య నేత అని.. రాజయ్యను భారీ మెజార్టీతో గెలిపించి కేసీఆర్‌కు కానుకగా ఇవ్వాలని తెలిపారు. కేసీఆర్ నాయకత్వంలో తానూ, రాజయ్య కలిసి పనిచేస్తున్నట్టు కడియం పేర్కొన్నారు. 
Kadiyam Srihari
Rajaiah
Station Ghanpur
KCR
TRS

More Telugu News