modi: మోదీ, అమిత్ షా ల ఆస్థానకవి రాకేష్ ఆస్థానా!: జూపూడి ప్రభాకర్

  • సీబీఐని బీజేపీ నాశనం చేసింది
  • రాజ్యాంగ బద్ధ సంస్థలను బీజేపీ భ్రష్టు పట్టిస్తోంది
  • అలోక్ వర్మ సవాల్ ను మోదీ పట్టించుకోలేదు

నరేంద్ర మోదీ, అమిత్ షాల ఆస్థాన కవి సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా అని ఏపీ టీడీపీ నేత, ఏపీ ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ జూపూడి ప్రభాకర్ రావు విమర్శించారు. ఈరోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఆస్థానా నియామకాన్ని సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ సవాల్ చేసినప్పటికీ మోదీ పట్టించుకోలేదని విమర్శించారు. దేశంలోనే అత్యున్నత విచారణ సంస్థ అయిన సీబీఐని బీజేపీ నాశనం చేసిందని, రాజ్యాంగ బద్ధ సంస్థలను బీజేపీ ఓ పద్ధతి ప్రకారం భ్రష్టు పట్టిస్తోందని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. 

  • Loading...

More Telugu News