vajpayee: వాజ్ పేయి, అద్వానీ సిద్ధాంతాలను బీజేపీ విస్మరించింది: కరుణా శుక్లా

  • రాష్ట్రానికి రమణ్ సింగ్ చేసిందేమీ లేదు
  • రాజ్ నందగావ్ ను ఏమాత్రం అభివృద్ధి  చేయలేదు
  • ప్రజల పక్షాన పోరాడేందుకు తాను సిద్ధంగా ఉన్నా
ఛత్తీస్ గఢ్ లో బీజేపీ తరఫున సీఎంగా ఉన్న రమణ్ సింగ్ పై, బీజేపీ దివంగత నేత వాజ్ పేయి మేనకోడలు కరుణా శుక్లా పోటీ చేయనున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఆమె మీడియాతో మాట్లాడుతూ, రాష్ట్రానికి రమణ్ సింగ్ చేసిందేమీ లేదని విమర్శించారు. పదేళ్లుగా రాజ్ నంద్ గావ్ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న రమణ్ సింగ్ ఆ నియోజకవర్గం అభివృద్ధికి ఏమాత్రం పాటుపడలేదని, ప్రజల పక్షాన పోరాడేందుకు తాను సిద్ధంగా ఉన్నానని అన్నారు. వాజ్ పేయి, అద్వానీ సిద్ధాంతాలను బీజేపీ విస్మరించిందని రాజ్ నందగావ్ నుంచి కాంగ్రెస్ తరఫున పోటీ చేస్తున్న కరుణా శుక్లా దుయ్యబట్టారు.
vajpayee
lk advandi
karuna sukla

More Telugu News