CBI: సీబీఐ డిప్యూటీ చీఫ్ సస్పెన్షన్‌కు రంగం సిద్ధం!

  • ప్రధాని మోదీతో భేటీ అనంతరం సీబీఐ చీఫ్ అలోక్ వర్మ నిర్ణయం
  • ఆరోపణలు ఎదుర్కొంటున్న రాకేష్ ఆస్థానాపై సీబీఐ కేసు నమోదు
  • సీబీఐ కార్యాలయంలోని ఆయన గదిలో సోదాలు

ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అనంతరం సీబీఐ చీఫ్ అలోక్ వర్మ కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. అవినీతి ఆరోపణలతో పాటు సీబీఐ చీఫ్‌పై కేసులు నమోదు చేసిన సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌ రాకేశ్‌ అస్థానాను సస్పెండ్ చేసేందుకు ఆయన సిద్ధమయ్యారు. ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశం, చర్చల అనంతరం వర్మ ఈ నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే అస్థానాపై సీబీఐ కేసులు నమోదు చేసింది. సీబీఐ కార్యాలయంలోని ఆయన గదిలో నిన్న సోదాలు నిర్వహించింది.

మరోవైపు, సీబీఐ బాస్‌పై ఆధారాలు లేకుండా ఆరోపణలు, కేసులు నమోదు చేయడానికి రాకేశ్ అస్థానాకు సహకరించిన అధికారి దేవేందర్ కుమార్‌ను సీబీఐ అరెస్ట్ చేసింది. ఈ కేసులపై విచారణ జరగనుంది. ఇదిలావుండగా సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ అస్థానా చర్యలు అనుమానాస్పదంగా ఉన్నాయని, అనైతికంగా వ్యవహరిస్తున్నారంటూ సీబీఐ డైరెక్టర్ వర్మ ప్రధానికి లేఖ రాశారు. ఈ లేఖపై స్పందించిన మోదీ ఇరువురికీ సమన్లు పంపించారు.

More Telugu News