Andhra Pradesh: అనంతపురం రైతులకు చావుదెబ్బ.. 9,000 ఎకరాల్లో మిర్చి పంటను నాశనం చేసిన ‘గిల్ట్’ తెగులు!

  • రెండు వేల ఎకరాల్లో పంటను తొలగించిన రైతులు
  • భారీగా నష్టపోయామని ఆవేదన
  • విత్తన శుద్ధి చేయకుంటే తర్వాతి పంటకు సోకుతుందన్న నిపుణులు

సరైన వర్షపాతం, తగిన మద్దతు ధర లేక రైతన్నలు దేశవ్యాప్తంగా అల్లాడిపోతున్నారు. దీనికి తోడు చాలా చోట్ల తెగుళ్లు పంటను తీవ్రంగా నష్టపరుస్తున్నాయి. అసలే కష్టాల కడలిలో ఎదురీదుతున్న అనంతపురం జిల్లా అన్నదాతలకు మరో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. జిల్లాలోని మిర్చి పంటకు తాజాగా ‘విల్ట్’ అనే ప్రమాదకరమైన తెగులు సోకింది. దీని కారణంగా పచ్చటి మిర్చీ మొక్కలు సైతం ఎండిపోతాయి.

ఈ తెగులు పంటలకు చాలా వేగంగా వ్యాపిస్తుంది. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఉరవకొండ నియోజకవర్గంలోని 9,000 ఎకరాల్లోని మిర్చి పంటకు విల్ట్ తెగులు సోకడంతో అనంత అన్నదాతలు అల్లాడిపోతున్నారు. దీంతో మిగతా పంటలకు తెగులు వ్యాపించకుండా 2,000 ఎకరాల్లోని పంటను రైతులు తొలగించారు. ఈ నేపథ్యంలో నిపుణులు స్పందిస్తూ.. విత్తన శుద్ధి చేసుకోకుంటే తర్వాత వేసే పంటకు కూడా ఈ తెగులు వ్యాపిస్తుందని హెచ్చరించారు.

More Telugu News