Tamilnadu: తమిళనాడులో మళ్లీ మొదలైన రిసార్టు రాజకీయాలు... టెన్షన్ టెన్షన్!

  • దినకరన్ వర్గం ఎమ్మెల్యేలు రిసార్టుకు
  • ఎమ్మెల్యేల అనర్హత కేసులో నేడు తీర్పు
  • పోలీసు భద్రత కట్టుదిట్టం

తమిళనాడు రాష్ట్రం మరోసారి రిసార్టు రాజకీయాలకు వేదికైంది. నేడు 18 మంది ఎమ్మెల్యేల అనర్హత కేసులో మద్రాస్ హైకోర్టు తీర్పును ఇవ్వనున్న నేపథ్యంలో తన వర్గం ఎమ్మెల్యేలందరినీ శశికళ వర్గం నేత టీటీవీ దినకరన్ రిసార్టుకు తరలించారు. తమ ఎమ్మెల్యేలను దినకరన్ తిరునల్వేలి జిల్లా కుట్రాళం శివార్లలోని ఇసాక్కి రిసార్టులో ఉంచినట్టు తెలుస్తోంది.

తీర్పు వ్యతిరేకంగా వస్తే, మరోసారి దినకరన్ మార్కు రాజకీయాలు ప్రారంభమవుతాయని భావిస్తున్న పళనిస్వామి, పన్నీర్ సెల్వంలు ఎత్తుకు పైఎత్తులు వేసే ప్రయత్నాల్లో పడ్డారు. 18 మంది ఎమ్మెల్యేలు అనర్హులేనని తీర్పు వస్తే, పళనిస్వామి ప్రభుత్వం మైనారిటీలో పడిపోతుంది. ప్రస్తుతం రిసార్టుకు ఏడుగురు ఎమ్మెల్యేలు చేరుకోగా, టీటీవీకి అనుకూలంగా తీర్పు వస్తే, రాజకీయాలు మారుతాయని రాజకీయ నిపుణులు అంచనా వేస్తున్నారు. దీంతో రాష్ట్రవ్యాప్తంగా టెన్షన్ వాతావరణం పెరుగగా, దినకరన్ ప్రాబల్యం ఉన్న ప్రాంతాల్లో పోలీసు భద్రతను పెంచారు.

More Telugu News