Chandrababu: నోట్ల రద్దు నుంచి రాఫెల్ వరకు దోచేసి.. ఇప్పుడు దొంగ దీక్ష చేస్తున్నారు: ఏపీ మంత్రి నారా లోకేష్

  • దొంగలను దేశ సరిహద్దులు దాటిస్తున్నారు
  • అగ్రిగోల్డ్ అంశం కోర్టు పరిధిలో ఉంది
  • బాధితులకు కేంద్రం బెయిల్ ఔట్ ప్యాకేజ్ ప్రకటించాలి

బీజేపీ నేతల తీరు చూస్తుంటే 'దొంగే... దొంగ దొంగ' అని అరిచినట్టు ఉందని ఏపీ మంత్రి నారా లోకేష్ ఎద్దేవా చేశారు. నోట్ల రద్దు నుంచి రాఫెల్ యుద్ధ విమానాల వరకు దేశాన్ని దోచేశారని... ఇప్పుడు అగ్రిగోల్డ్ పేరుతో దొంగ దీక్షకు దిగడం హాస్యాస్పదంగా ఉందని అన్నారు. దొంగలను దేశ సరిహద్దులు దాటిస్తున్నారని విమర్శించారు. ప్రత్యేక హోదా నుంచి తిత్లీ తుపాను బాధితులను ఆదుకునే వరకు రాష్ట్రాన్ని బీజేపీ నిర్లక్ష్యం చేసిందని మండిపడ్డారు. దేశంలో ఏపీ భాగం కాదనే ధోరణితో బీజేపీ పెద్దలు వ్యవహరిస్తున్నారని అన్నారు.

అగ్రిగోల్డ్ అంశం కోర్టు పరిధిలో ఉందని, బాధితులకు న్యాయం చేసేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు కృషి చేస్తున్నారని లోకేష్ తెలిపారు. కోర్టులను కూడా కించపరుస్తూ ఆరోపణలు చేయడం సమంజసం కాదని అన్నారు. ఏవైనా ఆధారాలు ఉంటే చూపించాలని, అనవసర ఆరోపణలు చేయవద్దని సూచించారు. నిజంగా చిత్తశుద్ధి ఉంటే అగ్రిగోల్డ్ బాధితులకు బెయిల్ ఔట్ ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. 

More Telugu News