చోక్సీ నుంచి రూ. 24 లక్షలు అందుకున్న జైట్లీ కుమార్తె.. నిలదీసిన కాంగ్రెస్!
- డబ్బులు ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించిన సచిన్ పైలట్
- ఈ వార్తలను మీడియా ప్రచురించకపోవడం దారుణమన్న రాహుల్
- కలకలం రేపుతున్న ఆరోపణలు
ఈ క్రమంలో, ఎలాంటి సేవలు అందించని ఈ కంపెనీకి నిధులు ఎందుకిచ్చారని పైలట్ ప్రశ్నించారు. సొమ్ము తీసుకున్న రెండు నెలలకు ఆ డబ్బును తిరిగి గీతాంజలి కంపెనీ ఖాతాలో వేశారు. ఈ అంశంపై వివాదం నెలకొనడంతో డబ్బును వెనక్కి తిరిగిచ్చేశారని... అసలు డబ్బును ఎందుకు తీసుకున్నారని ప్రశ్నించారు. ఇదే విషయంపై రాహుల్ గాంధీ కూడా ట్వీట్ చేశారు. ఇలాంటి వాస్తవాలను మీడియా ప్రచురించకపోవడం దారుణమని అన్నారు.