sabarimal: శబరిమలలోకి మహిళల ప్రవేశం.. పిటిషన్లను విచారించేందుకు అంగీకరించిన సుప్రీంకోర్టు

  • 19 పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయన్న చీఫ్ జస్టిస్
  • ఎప్పుడు విచారిస్తామనే విషయాన్ని రేపు వెల్లడిస్తామన్న గొగోయ్
  • సుప్రీం తీర్పుతో రణరంగాన్ని తలపించిన శబరిమల పరిసర ప్రాంతాలు

శబరిమల ఆలయంలోకి మహిళలు ప్రవేశించవచ్చంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఉద్రిక్తతలకు కారణమైన సంగతి తెలిసిందే. ఈ తీర్పుకు సంబంధించి పలువురు సర్వోన్నత న్యాయస్థానంలో రివ్యూ పిటిషన్లు వేశారు. ఈ పిటిషన్లపై విచారణకు సుప్రీం అంగీకరించింది.

అయితే, పిటిషన్లను ఎప్పుడు విచారిస్తామనే విషయాన్ని రేపు వెల్లడిస్తామని తెలిపింది. ఈ అంశంపై 19 పిటిషన్లు పెండింగ్ లో ఉన్నాయని చీఫ్ జస్టిస్ గొగోయ్ తెలిపారు. మరోవైపు, సుప్రీం తీర్పుతో పలువురు మహిళలు ఆలయంలోకి వెళ్లేందుకు యత్నించారు. ఈ నేపథ్యంలో, అక్కడ ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. శబరిమల పరిసర ప్రాంతాలు రణరంగాన్ని తలపించాయి.

More Telugu News