tanusri dutta: తనుశ్రీకి పిచ్చి పట్టింది.. పబ్లిసిటీ కోసం ఆరోపణలు చేస్తోంది: రాఖీ సావంత్

  • పదేళ్లు కోమాలో ఉండి, ఇప్పుడు ఆరోపణలు చేస్తోంది
  • పబ్లిసిటీ కోసమే నానా పటేకర్ పై ఆరోపణలు
  • ఆమె చెప్పినట్టుగా ఏమీ జరగలేదు
బాలీవుడ్ నటుడు నానా పటేకర్, కొరియోగ్రాఫర్ గణేష్ ఆచార్యపై నటి తనుశ్రీ దత్తా లైంగిక ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, తనుశ్రీపై శృంగార నటి రాఖీ సావంత్ తీవ్ర వ్యాఖ్యలు చేసింది. తనుశ్రీకి పిచ్చి పట్టిందని... పదేళ్లపాటు కోమాలో ఉండి, ఇప్పుడు నోటికి వచ్చినట్టు మాట్లాడుతోందని మండిపడింది. పదేళ్లు అమెరికాలో గడిపి, ఇప్పుడు పబ్లిసిటీ కోసం నానా పటేకర్ పై ఆరోపణలు చేస్తోందని విమర్శించింది. తనుశ్రీ చెబుతున్నవన్నీ అబద్ధాలేనని, ఆమె చెప్పినట్టుగా ఏమీ జరగలేదని తెలిపింది. 
tanusri dutta
nana patekar
rakhi sawanth
bollywood
metoo

More Telugu News