Telugudesam: చంద్రబాబు సమక్షంలో టీడీపీలో చేరిన సినీ నటి రేవతి చౌదరి

  • 1998లో మిస్ విజయవాడగా ఎంపికైన రేవతి
  • 'కాకతీయుడు' సినిమాలో చాన్స్ 
  • త్వరలో విడుదల కానున్న ఆమె నటించిన చిత్రం

టీడీపీ అధినేత చంద్రబాబు సమక్షంలో సినీ నటి రేవతి చౌదరి ఆ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సందర్భంగా ఆమెకు పార్టీ కండువా కప్పి సాదరంగా ఆహ్వానించారు చంద్రబాబు. టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ, సీనియర్ నేత దేవేందర్ గౌడ్ సమక్షంలో ఈ కార్యక్రమం జరిగింది. టీటీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులతో ఈరోజు చంద్రబాబు భేటీ అయ్యారు. ఎన్నికల వ్యూహంపై చర్చించారు. ఈ సందర్భంగా రేవతి టీడీపీలో చేరారు.

రేవతి వివరాల్లోకి వెళ్తే, శివాజీ హీరోగా నటించిన చిత్రంతో ఆమె వెండితెరకు పరిచయమయ్యారు. అయితే, కొన్ని కారణాల వల్ల ఆ సినిమా విడుదల కాలేదు. తారకరత్న నటించిన 'కాకతీయుడు' సినిమాలో కూడా ఆమె నటించారు. త్వరలోనే ఈ చిత్రం విడుదల కానుంది. విజయవాడకు చెందిన రేవతి నాగార్జున యూనివర్శిటీలో చదివారు. 1998లో మిస్ విజయవాడగా ఎంపికయ్యారు. సినిమారంగంపై ఇష్టంతో హైదరాబాదుకు మకాం మార్చారు.

More Telugu News