కంపుకొట్టిన రైల్వే ఆహారం... విసిరి పారేసిన 2 వేల మంది జవాన్లు, ఖాళీ కడుపుతో ప్రయాణం!
- ఎన్నికల విధులపై బయలుదేరిన సీఆర్పీఎఫ్ జవాన్లు
- రాయగఢ్ లో వారికి భోజనం
- వాసన వస్తుండటంతో విసిరి పారేసిన జవాన్లు
- రైలు గంటలకొద్దీ ఆలస్యంగా వచ్చిందన్న అధికారులు
వారికిచ్చిన ఆహారం కంపు కొడుతూ ఉండటమే ఇందుకు కారణం. తమకిచ్చిన ఫుడ్ ప్యాకెట్లను రైల్వే ట్రాక్ పై విసిరివేసిన వారు, తిరిగి ఆహారం అందించాలని కోరినా ప్రయోజనం లేకపోయింది. దీంతో వారు మంచినీరు, టీ తాగి ఖాళీ కడుపుతోనే ప్రయాణించాల్సి వచ్చింది. దీనిపై రైల్వే శాఖ స్పందిస్తూ, రావాల్సిన సమయం కన్నా రైలు నాలుగు గంటల ఆలస్యంగా వచ్చిందని, ఈ కారణంతో పప్పు పాడైపోయి వాసన వచ్చిందని వివరణ ఇచ్చింది.