kcr: అభ్యర్థులతో ముగిసిన కేసీఆర్ సమావేశం.. వివరాలను వెల్లడించిన కడియం శ్రీహరి

  • 100కు పైగా స్థానాల్లో గెలుస్తామని కేసీఆర్ చెప్పారు
  • ఓటర్లందరినీ అభ్యర్థులు కనీసం రెండు సార్లు కలవాలి
  • మహాకూటమి గురించి చర్చించలేదు

తెలంగాణ భవన్ లో టీఆర్ఎస్ అభ్యర్థులు, ఎంపీలతో ఆ పార్టీ అధినేత కేసీఆర్ నిర్వహించిన సమావేశం ముగిసింది. అనంతరం కడియం శ్రీహరి మాట్లాడుతూ, సమావేశ వివరాలను మీడియాకు వెల్లడించారు. ఇప్పటి వరకు జరిగిన ప్రచారాన్ని బట్టి కచ్చితంగా 100కు పైగా స్థానాల్లో టీఆర్ఎస్ గెలుస్తుందని కేసీఆర్ చెప్పారని ఆయన తెలిపారు.

ఇప్పటి వరకు కేసీఆర్ పెట్టిన మూడు సభలు దక్షిణ తెలంగాణలో జరిగాయని.. ఈ నేపథ్యంలో ఉత్తర తెలంగాణలోని వరంగల్, ఖమ్మం, కరీంనగర్ లలో ఈ నెలలోనే సభలు పెట్టాలని ఆయనను కోరామని చెప్పారు. 100 స్థానాల్లో ఎన్నికల ప్రచారం చేయాలని కేసీఆర్ భావిస్తున్నారని తెలిపారు. ప్రతి అభ్యర్థి తమ నియోజకవర్గంలో ఒక బాక్స్ ఆఫీన్ ను ఏర్పాటు చేసుకోవాలని సూచించారని అన్నారు.  

నెల 15 రోజుల నుంచి తమ అభ్యర్థులు ప్రచారం చేస్తున్నారని కడియం చెప్పారు. ఎన్నికల నోటిఫికేషన్ వచ్చే నాటికి కేసీఆర్ 40 నియోజకవర్గాల్లో సభలు పెడతారని తెలిపారు. ఓటర్లందరినీ అభ్యర్థులు కనీసం రెండుసార్లు ప్రత్యక్షంగా కలవాలని నిర్ణయించామని చెప్పారు. సంక్షేమ పథకాలను పెద్ద ఎత్తున లబ్ధిదారుల్లోకి తీసుకెళ్లాలని అన్నారు.

 కేసీఆర్ మరోసారి ముఖ్యమంత్రి కావడం చారిత్రక అవసరమని చెప్పారు. ఎన్నికల్లో పోటీచేయాలనే కోరిక చాలా మందికి ఉంటుందని, కానీ ఒక్కరికి మాత్రమే టికెట్ వస్తుందని చెప్పారు. ఎవరు పోటీ చేసినా అందరం కలసి గెలిపించుకుంటామని తెలిపారు. మహాకూటమి తమకు పోటీనే కాదని, ఆ కూటమి గురించి తాము చర్చించలేదని చెప్పారు. 

More Telugu News