Rehana Fathima: అయ్యప్పను దర్శించుకునేందుకు వెళ్లిన రెహానా ఫాతిమాపై ముస్లిం పెద్దల బహిష్కరణ శిక్ష!

  • మతాచారాలకు విరుద్ధంగా ప్రవర్తించిన రెహానా ఫాతిమా
  • విగ్రహారాధన చేయాలన్న ఉద్దేశంతో ఉన్న ఆమె ముస్లిం కాదు
  • బహిష్కరిస్తున్నట్టు ప్రకటించిన ఎర్నాకులం ముస్లిం పెద్దలు

ముస్లిం మతాచారాలకు విరుద్ధంగా ప్రవర్తించిన రెహానా ఫాతిమాను తమ వర్గం నుంచి బహిష్కరిస్తున్నట్టు ఎర్నాకులం ముస్లిం సంఘం ప్రకటించింది. మత విశ్వాసాలను కాలరాస్తూ, విగ్రహారాధన చేయాలన్న ఉద్దేశంతో రెహానా, అయ్యప్ప దేవాలయానికి వెళ్లిందని ఆరోపించిన మత పెద్దలు, ఆమెను బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు.

 కాగా, రెండు రోజుల క్రితం పోలీసుల సాయంతో సన్నిధానం వరకూ చేరుకున్న ఆమె, అక్కడి తీవ్ర నిరసనలతో స్వామిని దర్శించుకోకుండానే కిందకు వచ్చిన సంగతి తెలిసిందే. ఆమె అయ్యప్ప వద్దకు వెళ్లిందని తెలుసుకున్న కేరళ హిందూ సంఘాలు, ఎర్నాకులంలోని ఆమె ఇంటిని సర్వనాశనం చేశాయి. ఇంట్లోని గృహోపకరణాలను ధ్వసం చేయగా, దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు, దాడికి పాల్పడిన వారిని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నారు.

More Telugu News