Telangana: తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు బీజేపీ తొలి జాబితా... ఎక్కడి నుంచి ఎవరంటే..!

  • 38 మందితో తొలి జాబితా
  • ముగ్గురు మహిళలకు స్థానం
  • ఆరుగురు ఎస్టీలు, ముగ్గురు ఎస్సీలకు అవకాశం

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి భారతీయ జనతా పార్టీ తన తొలి జాబితాను ప్రకటించింది. ప్రధాని నరేంద్ర మోదీ అధ్యక్షతన న్యూఢిల్లీలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమైన ఎన్నికల కమిటీ 38 మంది పేర్లతో కూడిన జాబితాను ఖరారు చేసింది. ఈ జాబితాలో ముగ్గురు మహిళలకు, ఆరుగురు ఎస్టీలు, ముగ్గురు ఎస్సీలకు చోటు దక్కింది. ముగ్గురు డాక్టర్లు కూడా బీజేపీ తరఫున బరిలోకి దిగనున్నారు.

కే లక్ష్మణ్‌ (ముషీరాబాద్‌), జీ కిషన్‌ రెడ్డి (అంబర్‌ పేట్‌), చింతల రామచంద్రా రెడ్డి (ఖైరతాబాద్‌), ఎన్వీఎస్‌ఎస్‌ ప్రభాకర్‌ (ఉప్పల్‌), రాజా సింగ్‌ (గోషా మహల్‌), ఎన్‌ రామచందర్‌రావు (మల్కాజ్‌ గిరి), పేరాల శేఖర్‌ రావు (ఎల్బీ నగర్‌), జీ రామకృష్ణారెడ్డి (పెద్దపల్లి), సక్కినేని వెంకటేశ్వర్రావు (సూర్యాపేట్‌), పీ మోహన్‌ రెడ్డి (మేడ్చల్‌), టీ ఆచారి (కల్వకుర్తి), జీ మనోహర్‌ రెడ్డి (మునుగోడు), కొండపల్లి శ్రీధర్‌ రెడ్డి (పాలేరు), బండి సంజయ్‌ (కరీంనగర్‌), ఎమ్‌ రఘునందన్‌ రావు (దుబ్బాక), బాబు మోహన్‌ (ఆందోల్‌), కుంజ సత్యవతి (భద్రాచలం), పాయల్‌ శంకర్‌ (ఆదిలాబాద్‌), పదకంటి రమాదేవి (ముథోల్‌) పోటీ చేస్తారు.

ఇక, కే రతంగ పాండురెడ్డి (నారాయణ్‌ పేట్‌), బీ కొండయ్య (మక్తల్‌), ఎన్‌ శ్రీవర్ధన్‌ రెడ్డి (షాద్‌ నగర్‌), పీ విజయ చంద్రారెడ్డి (పరకాల), చందుపట్ల కీర్తి రెడ్డి (భూపాలపల్లి), మాధవి రాజు (భోథ్‌), కొయ్యల ఏమాజి (బెల్లంపల్లి), వెంకట రమణా రెడ్డి (కామారెడ్డి), కేశ్‌ పల్లి ఆనంద్‌ రెడ్డి (నిజామాబాద్‌ రూరల్‌), సంతోష్‌ కుమార్‌ చందా (పినపాక), ప్రొద్దుటూరి వినయ్‌ కుమార్‌ రెడ్డి (ఆర్మూర్‌), కన్నం అంజయ్య (ధర్మపురి), గడ్డం నాగరాజు (మానకొండూరు), పటేల్‌ రవిశంకర్‌ (తాండూర్‌), అమర్‌ సింగ్‌ (కార్వాన్‌), గద్వాల్‌ వెంకటాద్రి రెడ్డి (గద్వాల), మల్లేశ్వర్‌ మేడిపూర్‌ (అచ్చంపేట్‌), నంబూరి రామలింగేశ్వర రావు (సత్తుపల్లి), జే వెంకట్‌ (కోరుట్ల)లు తొలి జాబితాలో స్థానం పొందారు.

More Telugu News