Jammu And Kashmir: జమ్ముకశ్మీర్‌ పురపాలక ఎన్నికల్లో విజయఢంకా మోగించిన బీజేపీ

  • ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో సత్తా చాటిన బీజేపీ
  • జమ్ము కార్పొరేషన్ లో 75 స్థానాలకు గాను 43 స్థానాల్లో గెలుపు
  • కశ్మీర్ లోయలో తొలిసారి 97 వార్డుల్లో జయకేతనం

జమ్ముకశ్మీర్ లో జరిగిన పురపాలక ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటింది. ఉగ్రవాద ప్రభావిత ప్రాంతాలైన పుల్వామా, కుల్గాం, అనంత్ నాగ్, షోపియాన్ జిల్లాల్లో విజయకేతనం ఎగురవేసింది. కశ్మీర్ లోయలో తొలిసారి 97 వార్డుల్లో విజయఢంకా మోగించింది. అనంత్ నాగ్ లో 29, బారాముల్లాలో 25, షోపియాన్ లో 12 వార్డుల్లో బీజేపీ గెలుపొందినట్టు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ తెలిపారు. జమ్ము కార్పొరేషన్ లో 75 స్థానాలకు గాను 43 స్థానాల్లో గెలుపొందింది.

అయితే లడ్డాఖ్ ప్రాంతంలో మాత్రం బీజేపీ ఖాతా తెరవలేకపోయింది. లడ్డాఖ్, కార్గిల్, లేహ్ ప్రాంతాల్లో కాంగ్రెస్ విజయ ఢంకా మోగించింది. సాంబ జిల్లాలో బీజేపీ 18, కాంగ్రెస్ 9 స్థానాల్లో గెలవగా... 27 స్థానాల్లో ఇండిపెండెంట్లు గెలుపొందారు. కశ్మీర్ లోయలోని 598 వార్డుల్లో 231 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. 181 వార్డుల్లో ఒక్క అభ్యర్థి కూడా పోటీ చేయలేదు. అత్యధిక వార్డుల్లో కేవలం మూడు నుంచి పది ఓట్లు మాత్రమే పొంది... అభ్యర్థులు గెలుపొందారు.

More Telugu News