harish rao: ఒకప్పుడు హవాయి చెప్పులతో తిరిగిన హరీష్ రావు.. ఇప్పుడు ఎలా తిరుగుతున్నారు?: ఎల్.రమణ

  • ఎన్నికల కోసం టీఆర్ఎస్ ఇప్పటికే వెయ్యి కోట్లు ఖర్చు చేసింది
  • నిన్న పట్టుబడ్డ రూ. 10 కోట్లు ఎవరివో కేసీఆర్ చెప్పాలి
  • కేసీఆర్ రూ. 10 కోట్లు ఇస్తానన్నట్టు నాయిని చెప్పారు
టీఆర్ఎస్ నేతలపై టీటీడీపీ అధ్యక్షుడు ఎల్.రమణ విమర్శలు గుప్పించారు. ఒకప్పుడు హైదరాబాదులో హవాయి చెప్పులతో తిరిగిన హరీష్ రావు... ఇప్పుడు ఎలా తిరుగుతున్నారో ప్రజలంతా గమనిస్తున్నారని అన్నారు. ఎన్నికల కోసం టీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే రూ. 1000 కోట్లు ఖర్చు చేసిందని ఆరోపించారు. నిన్న పట్టుబడిన రూ. 10 కోట్లు ఎవరివో ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పాలని డిమాండ్ చేశారు.

ఎల్బీ నగర్ నుంచి పోటీ చేస్తే రూ. 10 కోట్లు ఇస్తానని కేసీఆర్ చెప్పారని సాక్షాత్తు నాయిని నర్సింహారెడ్డే చెప్పారని విమర్శించారు. టీడీపీ నేత అనిల్ వల్లభనేనిపై టీఆర్ఎస్ నేతలు అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. తమ అధినేత చంద్రబాబుతో పాటు తనపై కేసీఆర్ దుష్ట ప్రయోగం చేసేందుకు యత్నిస్తున్నారని అన్నారు. కేసీఆర్ కు ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు.
harish rao
kcr
nayini

More Telugu News