Anantapur District: అనంతపురం వన్‌టౌన్‌ సీఐ విజయభాస్కర్‌ గౌడ్‌ వీరంగం

  • లంచం ఇవ్వలేదన్న అక్కసుతో పర్మిట్ రూమ్‌పై దాడి
  • మద్యం తాగుతున్న వారిని కాలితో తన్నుతూ చిందులు
  • సోషల్ మీడియాలో వీడియో వైరల్
అనంతపురం వన్‌టౌన్‌ సీఐ విజయభాస్కర్‌ గౌడ్‌ విచక్షణ మరిచారు. లంచం ఇవ్వలేదన్న కారణంతో ఎక్సైజ్ శాఖ అనుమతి ఇచ్చిన పర్మిట్ రూములో మద్యం తాగుతున్న వారిపై విరుచుకుపడ్డారు. కాలితో తన్నుతూ వీరంగమేశారు. మద్యం తాగుతున్న వారిపై ఆయన విరుచుకుపడుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సీఐ ప్రవర్తనపై మద్యం వ్యాపారులతోపాటు ఎక్సైజ్ శాఖ అధికారులు కూడా ఆగ్రహంగా ఉన్నారు.  హౌసింగ్‌ బోర్డు కాలనీలోని వైన్‌ షాపు నెంబర్‌-5లో సీఐ వీరంగమేసిన దృశ్యాలు ఇప్పుడు హల్‌చల్ చేస్తున్నాయి. లంచం ఇవ్వలేదనే అక్కసుతోనే ఆయన ఈ దౌర్జన్యానికి పాల్పడినట్టు ఆరోపణలు వస్తున్నాయి. ప్రతి నెల ఒక్కో మద్యం షాపు నుంచి రూ.15 వేలు లంచంగా వసూలు చేస్తారని తెలుస్తోంది.  
Anantapur District
Andhra Pradesh
Police
Vijay Bhaskar Goud
Liquor shop
Viral Videos

More Telugu News