Punjab: రైలు ప్రమాదంపై చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి

  • దసరా రోజు పెను విషాదమిది
  • దురదృష్టకరమన్న చంద్రబాబు
  • ప్రమాదంలో 60 మందికిపైగా మృతి
పంజాబ్‌లోని అమృత్‌సర్ సమీపంలో జరిగిన ఘోర రైలు ప్రమాదంపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు స్పందించారు. ప్రమాదంపై తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దసరా వేడుకల్లో పెను విషాదం చోటుచేసుకోవడం దురదృష్టకరమన్నారు. పెద్ద సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోవడంపై విచారం వ్యక్తం చేశారు.  

శుక్రవారం సాయంత్రం పంజాబ్‌లోని జోడా పాఠక్‌ వద్ద జరిగిన ఘోర ప్రమాదంలో 60 మందికిపైగా ప్రాణాలు కోల్పోయారు. దసరా ఉత్సవాల్లో భాగంగా రావణ దహన కార్యక్రమానికి హాజరైన వారు రైలు పట్టాలపై ఉండగా రైలు వారిని తొక్కుకుంటూ పోయింది. దీంతో అప్పటి వరకు ఆనందంతో కేరింతలు కొట్టిన ఆ ప్రదేశంలో ఒక్కసారిగా విషాదం అలముకుంది. మృతదేహాలు చెల్లాచెదురుగా పడ్డాయి. రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్, ప్రధాని నరేంద్రమోదీ, పంజాబ్ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్ సింగ్ సహా అందరూ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
Punjab
Rail mishap
Andhra Pradesh
Chandrababu
Amritsar

More Telugu News