artificial moon: విద్యుత్ ఆదా కోసం.. కృత్రిమ చంద్రుడిని ప్రవేశపెట్టనున్న చైనా!

  • వీధి దీపాల విద్యుత్ ఖర్చును తగ్గించుకునేందుకు చైనా ప్రయోగం
  • చంద్రుడికన్నా 8 రెట్లు ఎక్కువ వెలుగును ఇవ్వనున్న కృత్రిమ చంద్రుడు
  • 2020 నాటికి తొలి ప్రయోగం
2020 నాటికి కృత్రిమ చంద్రుడిని ప్రవేశపెట్టే దిశగా చైనా అడుగులు వేస్తోంది. ఇది ఒరిజినల్ చంద్రుడికన్నా ఎనిమిది రెట్లు ప్రకాశవంతంగా ఉండబోతోంది. అర్బన్ ప్రాంతాల్లో వీధి దీపాలకు అవుతున్న విద్యుత్ ఖర్చును తగ్గించుకునేందుకు చైనా ఈ ప్రయోగం చేపట్టబోతోంది.

తొలి కృత్రిమ చంద్రుడి ప్రయోగం సఫలమైతే... 2022 నాటికి మరో మూడు చంద్రులను ప్రయోగించనున్నారు. ఈ చంద్రులపై సూర్యకాంతి పడటం వల్ల అవి కిందకు వెలుగును ప్రసరిస్తాయి. చంద్రుడి కంటే ఎనిమిది రెట్లు కాంతిని ప్రసరింపజేయడం వల్ల, రాత్రిపూట వీధి దీపాల అవసరం ఉండదు. ఒక్కో కృత్రిమ చంద్రుడు 50 చదరపు కిలోమీటర్ల మేర వెలుగును ఇవ్వగలడని అంచనా వేస్తున్నారు. 
artificial moon
china
illumination satellites

More Telugu News