sabarimala: ఏదైనా జరిగి ఉంటే ఆలయాన్ని మూసేయండి: శబరిమల అధికారులకు ట్రస్టు నిర్వాహకుల లేఖ

  • ఈరోజు ఆలయం సమీపంలోకి వెళ్లిన ముగ్గురు మహిళలు
  • ఆలయ ఆచారాలకు భంగం కలిగితే తలుపులు మూసేయాలన్న ట్రస్ట్
  • శుద్ధి చేసిన తర్వాతే ఆలయాన్ని తెరవాలని సూచన

హైదరాబాదుకు చెందిన జర్నలిస్టు కవితతో పాటు రిహానా ఫాతిమా, మేరీ స్వీటీ అనే మహిళలు ఈరోజు శబరిమల ఆలయానికి అత్యంత సమీపంలోకి వెళ్లిన సంగతి తెలిసిందే. గుర్భగుడి వద్ద ఉన్న 18 మెట్లకు 500 మీటర్ల దూరం వరకు వారు చేరుకున్నారు. అనంతరం భక్తులు అడ్డుకోవడంతో అక్కడి నుంచి వెనుదిరిగారు.

ఈ నేపథ్యంలో శబరిమల దేవస్థానం అడ్మినిస్ట్రేషన్, ఎగ్జిక్యూటివ్ అధికారులకు పందళ ప్యాలెస్ ట్రస్ట్ లేఖ రాసింది. ఒకవేళ ఆలయ ఆచారాలకు ఎలాంటి భంగమైనా వాటిల్లిఉంటే వెంటనే తలుపులు మూసేయాలని లేఖలో కోరింది. ప్రధాన అర్చకులు ఆలయాన్ని శుద్ధి చేసిన తర్వాతే ఆలయాన్ని మళ్లీ తెరవాలని సూచించింది. ఆలయంలోకి 10 నుంచి 50 ఏళ్ల మధ్య ఉన్న మహిళలు ప్రవేశించవచ్చంటూ సుప్రీంకోర్టు తీర్పును వెలువరించిన నేపథ్యంలో, రాజకుటుంబీకులు ఈనెల 12న శాంతియుతంగా నిరసన కార్యక్రమాన్ని కూడా చేపట్టారు.

More Telugu News