ram gopal varma: తిరుమల వెంకన్నను దర్శించుకున్న లక్ష్మీపార్వతి, వర్మ.. నిజాలను చూపించే ధైర్యం, శక్తి ఇవ్వాలని కోరుకున్నానన్న వర్మ!

  • పుట్టినప్పటి నుంచి దేవుడిని దర్శించుకోలేదు
  • ఎన్టీఆర్ పై ఉన్న గౌరవంతోనే స్వామిని దర్శించుకున్నా
  • 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్రంలో నిజాలను ప్రజలకు అందిస్తాం
తిరుమల వెంకన్నను వైసీపీ నాయకురాలు లక్ష్మీపార్వతి, సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మలు దర్శించుకున్నారు. వీరితో పాటు 'లక్ష్మీస్ ఎన్టీఆర్' చిత్ర యూనిట్ సభ్యులు కూడా శ్రీవారి దర్శనం చేసుకున్నారు. దర్శనం అనంతరం వర్మ మాట్లాడుతూ, పుట్టినప్పటి నుంచి తాను దేవుడిని దర్శించుకోలేదని చెప్పారు. కేవలం దివంగత ఎన్టీఆర్ పై ఉన్న గౌరవంతోనే తిరుమల వెంకన్నను దర్శించుకున్నానని చెప్పారు.

గతంలో తాను తెరకెక్కించిన 'గోవిందా గోవిందా' చిత్రం యాక్షన్ మూవీ అని... 'లక్ష్మీస్ ఎన్టీఆర్' వాస్తవిక చిత్రమని వర్మ తెలిపారు. ఈ సినిమాలో నమ్మలేని ఎమోషన్స్ ఉంటాయని చెప్పారు. నిజాలను ప్రజలకు అందించేందుకు చేస్తున్న ప్రయత్నాన్ని విజయవంతం చేయాలని దేవుడిని ప్రార్థించానని తెలిపారు. నిజాలను చూపించే ధైర్యం, సాహసం, శక్తి ఇవ్వాలని కోరుకున్నానని చెప్పారు.
ram gopal varma
lakshmi parvathi
lakshmis ntr
Tirumala

More Telugu News