Madhavi Latha: యామిని సాధినేనిపై నిప్పులు చెరిగిన నటి మాధవీలత!

  • పవన్ కల్యాణ్ ను విమర్శించిన యామిని
  • ఘాటుగా స్పందించిన మాధవీలత
  • మల్లెపూలను చూసినప్పుడే ఎందుకు అడగలేదని ఎద్దేవా
  • పవన్ డబ్బులు మీ అయ్యలు, తాతలు ఇవ్వలేదని వ్యంగ్యం
రాజమహేంద్రవరంలో జనసేన అధినేత పవన్ కల్యాణ్ కవాతు నిర్వహించి, ఆపై జరిగిన బహిరంగ సభలో టీడీపీని టార్గెట్ చేస్తూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారాన్ని రేపుతున్నాయి. పవన్ కల్యాణ్ ను విమర్శిస్తూ టీడీపీ మహిళా నేత సాదినేని  యామిని సోషల్ మీడియాలో పెట్టిన పోస్టులపై పవన్ కు వీరాభిమానిగా చెప్పుకునే నటి మాధవీలత తీవ్రంగా మండిపడింది.

ఇన్నాళ్లూ తనకు ఎందుకులే అని ఊరుకున్నానని, ఇప్పుడు తనకు ఎక్కడో కాలిందని నిప్పులు చెరుగుతూ, "మల్లెపూల విషయం ఏంటో దగ్గర్నుంచి యామిని సాధినేని చూశారేమో? చూసినప్పుడు అడగాలి కదా ఇప్పుడెందుకు అడగటం? వారసత్వం గురించి మాట్లాడే హక్కు లేదా? నిజమే ఎందుకంటే ఆయన వారసత్వంతో రాలేదు కదా? తెలియదులేమ్మా! కవాతు దేనికోసమా? ఏం చేశాడనా? ఏం చేయలేదు?" అని ప్రశ్నించింది

మీరు చేయలేనివి ఆయన చేసేద్దామన్న తపనతో పవన్ ఉన్నారని, ఆయన వ్యక్తిగత జీవితం మీద పడి ఏడవటమే తప్ప, మీకు పీకడానికి, చెప్పడానికి వేరే లేవు కదా అని ఎద్దేవా చేసింది. మొన్నటి దాకా బీజేపీ డబ్బులు తీసుకున్నాడని, నిన్నేమో ఎవరివో డబ్బులు ఖర్చుపెట్టాడని చేస్తున్న విమర్శలను ప్రస్తావిస్తూ, "మీ అయ్యలు ఇచ్చారా? మీ తాతలు ఇచ్చారా?... ఇవ్వలేదుగా ఇంక మళ్లీ నొప్పెందుకు పైసలు ఇవ్వకుండా ఇంతమంది జనం ఎందుకు వచ్చారనా? ఉంటదిలే కడుపులో మంట" అని తన ఫేస్‌ బుక్‌ లో యామినికి మాధవీ లత స్ట్రాంగ్ కౌంటర్‌ ఇచ్చింది.

ఇక మాధవీ లత పోస్టుపై పవన్ అభిమానులు స్పందిస్తూ, బాగా మాట్లాడారంటూ ప్రశంసిస్తున్నారు. ఇక మాధవీ వ్యాఖ్యలపై యామిని ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.


Madhavi Latha
Pawan Kalyan
Yamini
Facebook

More Telugu News