Airport: హైదరాబాద్ ను కమ్మేసిన పొగమంచు... పడిపోయిన ఉష్ణోగ్రతలు... ఆగిన విమాన సర్వీసులు!

  • గత రెండు రోజులుగా వర్షాలు 
  • కనిష్ఠానికి పడిపోయిన ఉష్ణోగ్రత
  • ఆలస్యంగా నడుస్తున్న విమానాలు
శుక్రవారం తెల్లవారుజామున హైదరాబాద్ నగరాన్ని పొగమంచు కమ్మేసింది. గత రెండు రోజులుగా కురిసిన వర్షాలతో ఉష్ణోగ్రతలు కనిష్ఠ స్థాయులకు పడిపోయాయి. గత రాత్రి హైదరాబాద్ లో కనిష్ఠంగా 20 డిగ్రీల సెంటీగ్రేడ్ ఉష్ణోగ్రత నమోదైంది. శంషాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో అలముకున్న పొగమంచు కారణంగా, విమానాశ్రయంలో విమానాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పలు విమానాలు ఆలస్యంగా నడుస్తున్నాయి.

మరోపక్క, హైదరాబాద్ - బెంగళూరు, హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారులను సైతం పొగమంచు కమ్మేయడంతో రోడ్లపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. ఉష్ణోగ్రతలు మరింతగా తగ్గనున్నాయని, చలికాలం వచ్చేసినట్టేనని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు.
Airport
Hyderabad
Fog
Wintter

More Telugu News