RX 100: 'అవకాశం ఇస్తే... నాకేమిస్తావ్ అన్నాడు': 'ఆర్ ఎక్స్ 100' హీరోయిన్ పాయల్

  • 'ఆర్ఎక్స్ 100'లో బోల్డ్ గా నటించిన పాయల్
  • ఓ సినిమా ఆఫర్ తో వెళ్లిన వ్యక్తి
  • అతని చెంపలు వాయించాలని అనిపించిందన్న పాయల్
ఇటీవల విడుదలై మంచి విజయం సాధించిన 'ఆర్ఎక్స్ 100' హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ సైతం లైంగిక వేధింపులను ఎదుర్కొందట. తన తొలి తెలుగు చిత్రంలో హాట్ సన్నివేశాల్లో నటించి, కుర్రకారును మత్తెక్కించిన ఈ భామ, 'మీటూ' ఉద్యమంపై స్పందిస్తూ, టాలీవుడ్ లో కాస్టింగ్ కౌచ్ నిజమేనని అంగీకరించింది. నటిగా నిరూపించుకున్న తరువాత కూడా తనను ఆ భూతం వీడలేదని చెప్పింది.

ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ, తొలి సినిమాలో బోల్డ్ గా నటించిన తనను అందరూ అలాగే చూస్తున్నారని వాపోయింది. ఇటీవల ఓ సినిమాలో అవకాశం ఇస్తానంటూ ఓ వ్యక్తి కలిశాడని, ఆఫర్ ఇస్తే తనకేమిస్తావని అడిగాడని, ఈ ప్రశ్నతో షాక్ కు గురయ్యానని చెప్పింది. అతని చెంపలు వాయించాలని అనిపించినా, కంట్రోల్ చేసుకున్నానని చెప్పింది. నా టాలెంట్ కు టాలీవుడ్ లో గుర్తింపు లభించిందేకానీ, ముద్దు సీన్లలో నటించినందుకు కాదని అతనికి గట్టిగానే చెప్పి, అతనిచ్చిన ఆఫర్ ను తిరస్కరించి వచ్చేశానని వ్యాఖ్యానించింది. అతని పేరును మాత్రం ఈ అందాల భామ బయటపెట్టక పోడవం గమనార్హం.
RX 100
Payal Rajput
Offer
Tollywood
Casting Couch

More Telugu News