Parineeti: బావగారిని రూ. 37 కోట్లు డిమాండ్ చేస్తున్న పరిణితి చోప్రా!

  • ఉత్తరాదిలో జరిగే పెళ్లి వేడుకల్లో 'జూతా చురానా'
  • చెప్పులు తిరిగివ్వాలంటే 37 కోట్లు ఇవ్వాల్సిందేనట
  • బావ నిక్ తో డీల్ మాట్లాడుకుంటున్న పరిణితి
తన సోదరి ప్రియాంకా చోప్రా వివాహంలో బావ నిక్ జోనాస్ తనకు రూ. 37 కోట్లను ఇవ్వాల్సిందేనని పట్టుబడుతోందట పరిణితి చోప్రా. ఉత్తరాదిలో జరిగే పెళ్లి వేడుకల్లో 'జూతా చురానా' అనే ఆసక్తికరమైన ఆట ఉంటుంది. ఇందులో భాగంగా పెళ్లి కొడుకు చెప్పులను మరదళ్లు దొంగిలించి దాచిపెడతారు. ఆ తరువాత డబ్బులు ఇస్తేనే చెప్పులు తిరిగిస్తారు. పెళ్లి వేడుకల్లో ఈ ఆట తప్పసరిగా వుంటుంది.

ఇక డబ్బు గురించి తన బావ నిక్ తో ముందే డీల్ మాట్లాడుకుంటున్నానని చెబుతోంది పరిణితి. మొత్తం 5 మిలియన్ డాలర్లు ఇవ్వాలని తాను అడగగా, 10 డాలర్లు మాత్రమే ఇస్తానని అంటున్నాడని, ఇద్దరి మధ్య ఇంకా డీల్ కుదరలేదని చెప్పింది. తాను ఆయనకు ప్రియమైన మరదలిని కాబట్టి, ఎలాగైనా అడిగినంతా ఇస్తాడనే అనుకుంటున్నట్టు నమ్మకంగా చెబుతోంది. ఇక వీరిద్దరి పెళ్లి మూడు రోజుల పాటు రాజస్థాన్ లోని జోథ్ పూర్ లో జరుగుతుందని సమాచారం. వీరిద్దరి నిశ్చితార్థం ఆగస్టు 18న జరిగిన సంగతి తెలిసిందే.
Parineeti
Joota Churana
Priyaanka Chopra
Nic Jonas

More Telugu News