Ponnam Prabhakar: ఒకే వేదికను పంచుకున్న కరీంనగర్ రాజకీయ ప్రత్యర్థులు!

  • దసరా పండుగ పూజలో పాల్గొన్న వినోద్, పొన్నం ప్రభాకర్
  • గిద్ద పెరమండల్ దేవస్థానంలో చోటు చేసుకున్న సన్నివేశం
  • పూజలో పాల్గొన్న గంగుల కమలాకర్
ఎప్పుడూ ఉప్పు, నిప్పులా ఉండే టీఆర్ఎస్, కాంగ్రెస్ నేతలు వీరు. రాజకీయ పరంగా ప్రతి రోజు ఒకరిపై మరొకరు విమర్శలు గుప్పించుకుంటుంటారు. గత ఎన్నికల్లో కూడా ఇద్దరూ కరీంనగర్ లోక్ సభ స్థానం నుంచి ఎన్నికల్లో పోటీ పడ్డారు. వారే టీఆర్ఎస్ ఎంపీ వినోద్, కాంగ్రెస్ మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్. అయితే ఈ ఇద్దరు ప్రత్యర్థులు దసరా పండుగ సందర్భంగా కలసిపోయారు. ఒకే వేదికను పంచుకున్నారు. గిద్ద పెరమండ్ల దేవస్థానంలో నిర్వహించిన పూజల్లో పాల్గొన్నారు. జమ్మి పూజలో భాగంగా వినోద్, పొన్నం ప్రభాకర్ లతో పాటు తాజా మాజీ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ కూడా పాల్గొన్నారు.
Ponnam Prabhakar
vinod
bangula kamalakar
TRS
congress

More Telugu News