vijayasanthi: జనసేనపై నాకంటూ ఒక అభిప్రాయం లేదు: విజయశాంతి

  • తెలంగాణలో పోటీ చేస్తామని జనసేన ఇంకా ప్రకటించలేదు
  • పవన్ కల్యాణ్ ప్రభావం ఏమేరకు ఉంటుందో చూడాలి
  • ప్రజలకు మేలు చేసేది కాంగ్రస్ పార్టీనే
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తామని జనసేన ఇంకా ప్రకటించలేదని, ఎన్నికల్లో పోటీ చేస్తామని ఆ పార్టీ ప్రకటిస్తే... అప్పుడు దానిపై మాట్లాడతానని కాంగ్రెస్ నాయకురాలు విజయశాంతి వ్యాఖ్యానించారు. పోటీ చేస్తామని ఒకవేళ ప్రకటిస్తే... ఆ పార్టీ అధినేత పవన్ కల్యాణ్ ప్రభావం ఏమేరకు ఉంటుందో చూడాలని అన్నారు. తనకంటూ జనసేనపై ఒక అభిప్రాయం లేదని చెప్పారు. ప్రజల నుంచే అభిప్రాయాలను తీసుకుంటానని... ప్రజల తరపునే మాట్లాడతానని తెలిపారు.

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి మంచి జరుగుతుందని విజయశాంతి చెప్పారు. అణగారిన వర్గాలకు మేలు చేసేది కాంగ్రెస్ పార్టీనే అని అన్నారు. టీఆర్ఎస్ మాదిరి అబద్ధాలు చెప్పి కాంగ్రెస్ పార్టీ మోసం చేయదని చెప్పారు.
vijayasanthi
congress
TRS
janasena
Pawan Kalyan

More Telugu News