Telangana: నిజాం షుగర్ ఫ్యాక్టరీని పిట్టల దొర కేసీఆర్, ఆయన కుమార్తె దగ్గరుండి మూయించారు!: షబ్బీర్ అలీ

  • 100 రోజుల్లో ఫ్యాక్టరీని స్వాధీనం చేసుకుంటామన్నారు
  • ఆర్మూరులో పసుపు ప్రాసెసింగ్ యూనిట్ ను మర్చిపోయారు
  • 20న రాహుల్ బహిరంగ సభను విజయవంతం చేస్తాం

తెలంగాణను అన్ని రంగాల్లో కేసీఆర్ నాయకత్వంలోని టీఆర్ఎస్ ప్రభుత్వం భ్రష్టు పట్టించిందని కాంగ్రెస్ నేత షబ్బీర్ అలీ విమర్శించారు. బంగారు తెలంగాణ కేవలం కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని అన్నారు. ఈ నెల 20న కామారెడ్డిలో రాహుల్ గాంధీ హాజరుకానున్న ఎన్నికల సభకు భారీగా జనం తరలివస్తున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం తెలంగాణ ప్రజలు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలను రాహుల్ ముందు ప్రస్తావిస్తామని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి కేసీఆర్, పార్లమెంటు సభ్యురాలు కవితపై అలీ తీవ్ర విమర్శలు చేశారు.

అద్భుతంగా నడుస్తున్న నిజాం షుగర్ ఫ్యాక్టరీని పిట్టలదొర కేసీఆర్, ఆయన కుమార్తె కవిత దగ్గరుండి మూయించారని ఆరోపించారు. నిజాం షుగర్స్ ఫ్యాక్టరీని 100 రోజుల్లో స్వాధీనం చేసుకుంటామని ఎన్నికల ప్రచారంలో చెప్పిన కేసీఆర్, ఆచరణలో మాత్రం చేయలేకపోయారని విమర్శించారు. ఆర్మూరులో పసుపు బోర్డును, ప్రాసెసింగ్ యూనిట్ ను పెడతామన్న హామీ కూడా గాల్లో కలిసిపోయిందన్నారు. అక్కడకు రాందేవ్ బాబా వచ్చినా, మరో బాబా వచ్చినా కంపెనీ ఏర్పాటు ఇంకా మొదలుకాలేదన్నారు.

అమెరికాలో బాత్రూములు కడిగిన మంత్రి కేటీఆర్ ‘కాంగ్రెస్ మా హామీలను కాపీ కొట్టింది’ అంటూ చెబుతున్నారనీ, అదే నోటితో కాంగ్రెస్ హామీలను అమలు చేయాలంటే 6 రాష్ట్రాల బడ్జెట్లు కావాలంటున్నారని అలీ గుర్తుచేశారు. దీనర్థం టీఆర్ఎస్ ప్రభుత్వం తప్పుడు హామీలిచ్చిందా? అని ప్రశ్నించారు.

More Telugu News