dulquer salman: పెళ్లి తర్వాత దుల్కర్ సల్మాన్ తో జతకడుతున్న సోనమ్ కపూర్

  • 'జోయా ఫ్యాక్టర్' చిత్రంలో నటిస్తున్న దుల్కర్
  • బాలీవుడ్ లో దుల్కర్ కు ఇది రెండో సినిమా
  • ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్న సోనమ్ కపూర్
'మహానటి' చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన దుల్కర్ సల్మాన్ కు దక్షిణాదిలో చాలా మంది అభిమానులు ఉన్నారు. బాలీవుడ్ లో తన చిత్రం 'కార్వా'తో దుల్కర్ మంచి విజయాన్ని అందుకున్నాడు. ఇప్పుడు తన రెండో బాలీవుడ్ చిత్రం 'జోయా ఫ్యాక్టర్'లో నటిస్తున్నాడు. ఈ చిత్రంలో దుల్కర్ సరసన అనిల్ కపూర్ కుమార్తె సోనమ్ కపూర్ నటించనుంది. ఇటీవలే ప్రేమ వివాహం చేసుకున్న సోనమ్... పెళ్లి తర్వాత నటిస్తున్న తొలి చిత్రం ఇదే. అనుజా చౌహాన్ రచించిన 'జోయా ఫ్యాక్టర్' పుస్తకం ఆధారంగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు.
dulquer salman
sonam kapoor
joya factor
Bollywood

More Telugu News