Prabhas: ఇటలీలో ప్రభాస్‌, అనుష్క.. వివాహ ప్రయత్నాలే అంటూ ఊహాగానాలు!

  • ప్రస్తుతం అక్కడ ఓ సినిమా షూటింగ్‌లో ఉన్న బాహుబలి హీరో
  • ఇటలీలో ఎంగేజ్‌ మెంట్‌ జరగనుందన్న జాతీయ మీడియా
  • 23న ప్రభాస్‌ పుట్టిన రోజున ఊహాగానాలకు తెరపడే అవకాశం
బాహుబలి సినిమాతో అమాంతం ఆకాశం అంత ఎత్తుకు వెళ్లిపోయిన టాలీవుడ్‌ హీరో ప్రభాస్‌, ఆ చిత్రం హీరోయిన్‌ అనుష్కశెట్టి పెళ్లి వార్తలు మరోసారి సామాజిక మాధ్యమాలు, ప్రసార మాధ్యమాల్లో హల్‌ చల్‌ చేస్తున్నాయి. ప్రభాస్‌ ఇటలీలో ఉండడం, అనుష్క కూడా ఇటీవల ఇటలీ వెళ్లడమే ఈ ఊహాగానాలకు కారణం.

వివరాల్లోకి వెళితే.. ప్రభాస్‌ హీరోగా రాధాకృష్ణ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఓ చిత్రం షూటింగ్‌ ప్రస్తుతం ఇటలీలో జరుగుతోంది. కొన్నాళ్లుగా సినిమాలకు దూరంగా ఉంటున్న అనుష్క ఇటీవల ఇటలీ వెళ్లి ప్రభాస్‌ను కలిసిందనే వార్త బయటకు పొక్కడంతో మళ్లీ వీరి ప్రేమ, పెళ్లి వ్యవహారాలు హాట్‌ టాపిక్‌గా మారాయి. అక్టోబరు 23న ప్రభాస్‌ పుట్టిన రోజు.

ఈ సందర్భంగా శుభవార్త వెలువరించాలన్న ఉద్దేశంతోనే చర్చించుకునేందుకు అనుష్క ఇటలీ వెళ్లారన్న ఊహాగానాలు హల్‌ చల్‌ చేస్తున్నాయి. వీరిద్దరి ఎంగేజ్‌మెంట్‌ ఇటలీలో జరగనుందని జాతీయ మీడియా కూడా  చెబుతుండడం ఆసక్తి రేకెత్తిస్తోంది. మొత్తం మీద 23న ఈ బాహుబలి జంట ఏమైనా సర్ప్రైజ్ చేస్తారో, ఇవన్నీ వట్టి పుకార్లే అని కొట్టిపారేస్తారో చూడాలి మరి.
Prabhas
asuska shetty
marriage topic

More Telugu News