చిత్తూరులో ఆర్టీసీ బస్సు-లారీ ఢీ.. ఏడుగురికి తీవ్ర గాయాలు!
- ఈరోజు ఉదయం మిట్టకండ్రిగ వద్ద ఘటన
- ఎదురుగా వస్తున్న బస్సును ఢీకొట్టిన లారీ
- ఆర్టీసీ బస్సు, లారీ డ్రైవర్ల పరిస్థితి సీరియఎస్
జిల్లాలోని శ్రీకాళహస్తి మండలం, మిట్టకండ్రిగ వద్ద ఈ రోజు ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడ్డ ఏడుగురు ప్రయాణికులను శ్రీకాళహస్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. ఇక ఈ యాక్సిడెంట్ లో గాయపడ్డ బస్సు, లారీ డ్రైవర్ ఆరోగ్య పరిస్థితి సీరియస్ గా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతిలోని రుయా ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.