Rasamai Balakishan: ‘రసమయి గో బ్యాక్’ అంటూ అడ్డుకున్న గ్రామస్తులు!

  • ఇల్లంతకుంట మండలంలో ముస్కాన్ పేటలో ఘటన
  • బతుకమ్మ వేడుకల్లో పాల్గొనేందుకు వెళ్లిన రసమయి
  • అంబేద్కర్, పూలేల విగ్రహాల ఆవిష్కరణకు ఎందుకు రాలేదన్న గ్రామస్తులు

టీఆర్ఎస్ నేత ‘రసమయి’ బాలకిషన్ కు చేదు అనుభవం ఎదురైంది. సిరిసిల్ల జిల్లా ఇల్లంతకుంట మండలంలోని ముస్కాన్ పేటలో బతుకమ్మ వేడుకల సందర్భంగా అక్కడికి వెళ్లిన ఆయన్ని గ్రామస్తులు, యువకులు అడ్డుకున్నారు. ఈ గ్రామంలో అంబేద్కర్, జ్యోతిరావ్ పూలేల విగ్రహాల ఆవిష్కరణకు రావాలని ఇటీవల ఆయన్ని ఆహ్వానించినప్పటికీ వెళ్లలేదట.

ఈ క్రమంలో బతుకమ్మ వేడుకల నిమిత్తం ఈ రోజు ఆ గ్రామానికి వెళ్లిన రసమయిని ఈ విషయమై యువకులు ప్రశ్నిస్తూ అడ్డుకున్నారు. తమ గ్రామానికి రావద్దని, ఇక్కడి నుంచి వెళ్లిపోవాలంటూ ‘రసమయి గో బ్యాక్’ అంటూ వారు ఆందోళనకు దిగారు. ఈ నేపథ్యంలో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత కొద్ది సేపటికి రసమయి అక్కడి నుంచి వెళ్లిపోయారు.

More Telugu News