లవ్ స్టోరీతో రంగంలోకి దిగుతోన్న మెగా హీరో
- మరో ప్రేమకథకు సన్నాహాలు
- తేజు సరసన కల్యాణి ప్రియదర్శన్
- వచ్చేనెల 2 నుంచి రెగ్యులర్ షూటింగ్
ఈ సినిమాలో కథానాయికగా కల్యాణి ప్రియదర్శన్ ను ఎంపిక చేసుకున్నారు. నవంబర్ 2వ తేదీ నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలుకానుందనేది తాజా సమాచారం. రొమాంటిక్ లవ్ స్టోరీస్ ను తెరపై ఆవిష్కరించడంలో కిషోర్ తిరుమల సిద్ధహస్తుడు. అదే కథాంశంతో ఈ సినిమా రూపొందుతుండటం అందరిలో ఆసక్తిని రేకెత్తిస్తోంది. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం యూత్ ను ఒక ఊపు ఊపేస్తుందని అంటున్నారు. ఈ సినిమాలోను కమెడియన్ గా సునీల్ చేస్తుండటం విశేషం.