Pawan Kalyan: నాటి వ్యాఖ్యలను పవన్ కల్యాణ్ గుర్తుంచుకుంటే మంచిది: వైసీపీ నేత ఆళ్ల నాని
- జగన్ కు అధికారమే పరమావధి అనడం కరెక్టు కాదు
- ‘కాంగ్రెస్’ నేత గులాం నబీ వ్యాఖ్యలు గుర్తున్నాయా?
- కాంగ్రెస్, టీడీపీల కుట్ర వల్లే జగన్ పై కేసులు
వైసీపీ అధినేత జగన్ అధికారమే పరమావధిగా భావిస్తున్నారని ‘జనసేన’ వ్యవస్థాపకుడు పవన్ కల్యాణ్ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నానని ఎమ్మెల్సీ ఆళ్ల నాని అన్నారు. ఈరోజు మీడియాతో ఆయన మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత గులాం నబీ ఆజాద్ నాడు చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించారు.
వైఎస్ రాజశేఖరరెడ్డి మరణానంతరం.. ఓదార్పుయాత్ర చేపట్టకుండా, కాంగ్రెస్ పార్టీని వీడకుండా జగన్ ఉన్నట్టయితే కేంద్ర మంత్రి అయ్యే వారు, లేకపోతే రాష్ట్రానికి ముఖ్యమంత్రి కూడా అయ్యేవారని గులాం నబీ వ్యాఖ్యానించారని, ఈ వ్యాఖ్యలను పవన్ కల్యాణ్ గుర్తుంచుకుంటే మంచిదని ఆళ్ల నాని సూచించారు. కాంగ్రెస్, టీడీపీ పార్టీల కుట్ర కారణంగానే జగన్ పై కేసులు ఉన్నాయని ఆరోపించారు.