sensex: నేడు భారీగా నష్టపోయిన స్టాక్ మార్కెట్లు

  • రూపాయి పతనం, అమ్మకాల ఒత్తిడితో భారీ నష్టం
  • సెన్సెక్స్ కు 382.90, నిఫ్టీకి 131.70 పాయింట్ల నష్టం
  • విప్రో, కోల్ ఇండియా తదితర సంస్థల షేర్లకు లాభం

రూపాయి పతనం, అమ్మకాల ఒత్తిడితో ఈరోజు స్టాక్ మార్కెట్లు భారీగా నష్టపోయాయి. సెన్సెక్స్ 382.90 పాయింట్లు నష్టపోయి 34,779.58 పాయింట్ల వద్ద, నిఫ్టీ 131.70 పాయింట్లు నష్టపోయి 10,453.05 పాయింట్ల వద్ద ముగిశాయి. కాగా, విప్రో, కోల్ ఇండియా, హెచ్సీఎల్, ఇన్ఫోసిస్, ఐటీసీ తదితర సంస్థల షేర్లు లాభాలు పొందగా, బజాజ్ ఫైనాన్స్, అదానీ పోర్ట్స్, ఎస్ బ్యాంక్, బీపీసీఎల్ మొదలైన సంస్థల షేర్లు భారీగా నష్టాపోయాయి. డాలరుతో రూపాయి మారకం విలువ 73.56 వద్ద కొనసాగుతోంది.

More Telugu News