dhanush: 'వడ చెన్నై'కి అనూహ్యమైన రెస్పాన్స్

  • ఈ రోజే విడుదలైన 'వడ చెన్నై'
  • ధనుశ్ నటనకు మంచి మార్కులు 
  • హైలైట్ గా నిలిచిన సంగీతం

తమిళంలో విభిన్నమైన కథాచిత్రాలను ఎంచుకునే హీరోలలో ధనుశ్ ముందువరుసలో కనిపిస్తాడు. ఆయన తాజా చిత్రంగా రూపొందిన 'వడ చెన్నై' ఈ రోజునే తమిళ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. తొలి ఆటతోనే ఈ సినిమాకి పాజిటివ్ టాక్ వచ్చింది. విడుదలైన అన్ని ప్రాంతాల నుంచి ఈ సినిమాకి అనూహ్యమైన రెస్పాన్స్ వస్తోంది.

ధనుశ్ ఇప్పటివరకూ చేసిన సినిమాలు ఒక ఎత్తు .. ఈ సినిమా ఒక ఎత్తు అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అక్కడి క్రిటిక్స్ ఈ సినిమాకి 4.5/5 రేటింగ్ ఇవ్వడం విశేషం. ధనుశ్ .. ఐశ్వర్య రాజేశ్ నటన ఈ సినిమాకి హైలైట్ గా నిలుస్తుందని అంటున్నారు. సంతోష్ నారాయణ్ సంగీతం ఈ సినిమాకి ప్రధానమైన బలంగా నిలిచిందని చెబుతున్నారు. ఇది తమిళవాసులకు సంబంధించిన కథ కావడం వలన, ఈ సినిమాను తెలుగులోకి అనువదించకపోవచ్చని చెప్పుకుంటున్నారు.   

More Telugu News