sabarimal: శబరిమల ఆలయంలోకి వెళ్లాలన్న ఇద్దరు మహిళల ప్రయత్నం ఫలించలేదు!

  • ఇద్దరు మహిళల్లో ఒకరు ఏపీ మహిళ
  • మార్గమధ్యంలోనే అడ్డుకున్న నిరసనకారులు
  • ముందుకు వెళ్లడం వీలు కాకపోవడంతో.. వెనుదిరిగిన మహిళలు
శబరిమల పరిసర ప్రాంతాలు ఉద్రిక్తంగా మారాయి. మరి కొన్ని గంటల్లో ఆలయ తలుపులు తెరుచుకోనుండటంతో భక్తులు ఆలయం వైపు కదులుతున్నారు. ఈ నేపథ్యంలో ఆలయంలోకి వెళ్లేందుకు ఇద్దరు మహిళలు విశ్వప్రయత్నం చేశారు. వీరిలో ఒకరు కేరళకు చెందిన మహిళ కాగా... మరొకరు ఏపీకి చెందినవారు. వారు కొండపైకి వెళ్తున్న క్రమంలో... నిరసనకారులు వారిని మార్గమధ్యమంలోనే అడ్డుకున్నారు. అయినప్పటికీ ఏమాత్రం తగ్గకుండా వారిద్దరూ ఆలయానికి చేరుకునేందుకు యత్నించారు. ఈ క్రమంలో వారు మరికొంత దూరం మాత్రమే వెళ్లగలిగారు. భద్రత లేకపోవడంతో నిరసనకారులకు భయపడి వాళ్లు వెనుదిరిగి వచ్చేశారు.
sabarimal
women
ap
kerala
entry

More Telugu News