రూ.99 చెల్లిస్తే నోకియా స్మార్ట్ ఫోన్ : వినియోగదారులకు కంపెనీ సులభ వాయిదాల అవకాశం
- ఫోన్ల విక్రయదారు హెచ్‌ఎండీ గ్లోబల్ ప్రకటన
- మిగిలిన మొత్తానికి నో కాస్ట్ ఈఎంఐ ఆఫర్
- నవంబరు 10 వరకు ఆఫర్ అందుబాటులో
నోకియా ఫోన్ల విక్రయదారు హెచ్‌ఎండీ గ్లోబల్ ఈ బంపర్ ఆఫర్ వినియోగించుకోవాలని కోరింది. ఈ ఆఫర్‌ను పొందాలనుకునే వారు దగ్గరలోని రిలయన్స్ జియో, జియో డిజిటల్ లైఫ్, క్రోమా స్టోర్స్‌లో సంప్రదించాలని సూచించారు. నవంబరు 10వ తేదీ వరకు ఈ ఆఫర్ అందుబాటులో ఉంటుందని ప్రకటించింది. కొన్ని ఎంపిక చేసిన క్రెడిట్, డెబిట్ కార్డులపై క్యాష్ బ్యాక్ ఆఫర్ కూడా ఉన్నట్లు హెచ్‌ఎండీ గ్లోబల్ పేర్కొంది.