nani: 'జెర్సీ' కోసం ఈ రోజు రంగంలోకి దిగిన నాని

  • నాని హీరోగా 'జెర్సీ'
  • క్లాప్ కొట్టిన త్రివిక్రమ్
  • రేపటి నుంచి రెగ్యులర్ షూటింగ్

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని ఒక సినిమా చేయనున్నాడనీ, క్రికెట్ నేపథ్యంలో ఈ సినిమా రూపొందనుందనే సంగతి తెలిసిందే. ఆ సినిమా ఈ రోజు ఉదయం పూజా కార్యక్రమాలు జరుపుకుంది. సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తోన్న ఈ సినిమాకి, హైదరాబాద్ - ఫిల్మ్ నగర్లోని సంస్థ కార్యాలయంలో కొంతసేపటి క్రితం పూజా కార్యక్రమాలను నిర్వహించారు. నానిపై దర్శకుడు త్రివిక్రమ్ క్లాప్ ఇవ్వగా తొలి షాట్ ను చిత్రీకరించారు. ఈ సినిమాలో నాని సరసన ఒక కథానాయికగా శ్రద్ధా శ్రీనాథ్ నటించనుంది. రెండు డిఫరెంట్ లుక్స్ తో ఈ సినిమాలో నాని కనిపించనున్నాడు. ఈ సినిమాను గురించి నిర్మాత మాట్లాడుతూ, రేపటి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ మొదలవుతుందని చెప్పారు. అన్నివర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ సినిమాను తీర్చిదిద్దనున్నామని అన్నారు. అనిరుథ్ సంగీతం ఈ సినిమాకి ప్రత్యేక ఆకర్షణగా నిలవనుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశారు.   

More Telugu News