nandita das: తన తండ్రిపై వచ్చిన లైంగిక ఆరోపణలపై నటి నందితా దాస్ స్పందన!

  • జతిన్ దాస్ పై లైంగిక ఆరోపణలు చేసిన మహిళ
  • 14 ఏళ్ల క్రితం లైంగికంగా వేధించారంటూ ఆరోపణ
  • అసభ్యకరం అంటూ కొట్టి పారేసిన జతిన్ దాస్
తన తండ్రి జతిన్ దాస్ పై వచ్చిన లైంగిక ఆరోపణలపై బాలీవుడ్ నటి, దర్శకురాలు నందితా దాస్ స్పందించారు. మీటూ ఉద్యమానికి తాను మద్దతు పలుకుతానని ఆమె మరోసారి స్పష్టం చేశారు. తన తండ్రిపై వచ్చిన ఆరోపణలు తనను కలతకు గురి చేశాయని ఆమె తెలిపారు. తనపై వచ్చిన ఆరోపణలను ఆయన ఇప్పటికే ఖండించారని అన్నారు.

మీటూ ఉద్యమానికి తాను బలమైన మద్దతుదారు అని నందితా దాస్ చెప్పారు. లైంగిక వేధింపులు ఎదుర్కొన్న మహిళలకు అండగా ఉంటానని చెప్పారు. మహిళల ఆవేదనను ప్రతి ఒక్కరూ వినాల్సిన అవసరం ఉందని... అప్పుడే మహిళలు తమకు జరిగిన అన్యాయాన్ని నిర్భయంగా చెప్పగలుగుతారని తెలిపారు. ఇదే సమయంలో మహిళలు కూడా నిజాయతీగా తమకు జరిగిన అన్యాయాలను బయటపెట్టాలని కోరారు. స్వలాభం కోసమో, ప్రచారం కోసమో తప్పుడు ఆరోపణలు చేస్తే ఉద్యమం నీరుకారిపోతుందని అన్నారు. ఎప్పటికైనా సత్యమే జయిస్తుందని... తన తండ్రి విషయంలో తాను ఇంతవరకే చెప్పగలనని అన్నారు.

నందితా దాస్ తండ్రి జతిన్ దాస్ కు చిత్రకారుడిగా పేరు ప్రఖ్యాతులు ఉన్నాయి. ఒక పేపరు తయారీ సంస్థకు సహయజమానురాలైన ఓ మహిళ ఆయనపై లైంగిక ఆరోపణలు చేశారు. 14 ఏళ్ల క్రితం జతిన్ దాస్ తనను లైంగికంగా వేధించారని ఆమె నిన్న ఆరోపించారు. ఈ ఆరోపణలపై జతిన్ దాస్ స్పందిస్తూ అసభ్యకరం (వల్గర్) అంటూ కొట్టిపారేశారు. 
nandita das
jatin das
father
sexual harrassment
bollywood
metoo

More Telugu News